బాలీవుడ్ నుండి తెలుగు, తమిళ పరిశ్రమల్లోకి కొత్త హీరోయిన్లు తరచూ ఎలా వస్తుంటారో విలన్లు కూడా అలానే వస్తున్నారు. అలా వచ్చిన వారిలో ఈ మధ్య బాగా పాపులర్ అయిన వ్యక్తి ఠాకూర్ అనూప్ సింగ్. 2013లో ప్రసారమైన మహాభారతం టీవి సీరియల్లో ధృతరాష్ట్రుడుగా నటించిన అనూప్, పూరి జగన్నాథ్ ‘రోగ్’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా విడుదల కాకముందే సూర్య చేసిన భారీ ప్రాజెక్ట్ ‘సింగం 3’ లో విలన్ గా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో పాటు ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉన్న సాయి ధరమ్ ‘విన్నర్’ చిత్రంలో కూడా ఆయన విలన్ పాత్ర చేశారు. నిన్న ‘సింగం 3', 'విన్నర్’ సినిమాల ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ‘సింగం 3’ మంచి విజయాన్నిచ్చిందని, ‘విన్నర్’ సినిమాలో తాను వరల్డ్ నెం.1 జాకీగా నటిస్తున్నానని అన్నారు. అలాగే స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాల్లో విలన్ పాత్రలు చేయాలని ఉందని, ఆ అవకాశం త్వరగా రావాలని అనుకుంటున్నానని, వాళ్ళతో కలిసి నటించడమంటే చాలా ఇష్టమని అన్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: