పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ త్వరలో మెగాఫోన్ పట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవలే అల్లు అర్జున్‌ను కలిసి ఓ కథ వినిపించినట్లు తెలిసింది. కాన్సెప్ట్‌లోని కొత్తదనం నచ్చడంతో బన్ని ఈ సినిమాలో నటించడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్ జరుగుతుందని, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిసింది.
ఈ చిత్రానికి 'నా పేరు సూర్య…నా ఇల్లు ఇండియా' అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో వున్నట్లు సమాచారం. టైటిల్‌ను బట్టి దేశభక్తి కథతో అల్లు అర్జున్, వక్కంతం వంశీలు సినిమా చేయనున్నారని ఊహించవచ్చు.
ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’లో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈ నెల 18న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. శివరాత్రి సందర్భంగా టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Post A Comment: