మెగా హిట్ చిత్రం బాహుబలి ఆధారంగా ఓ మొబైల్ గేమ్‌ను డిజైన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫామ్ విల్లే, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి ప్రఖ్యాత గేమ్‌లను డిజైన్ చేసిన మార్క్ స్కాగ్స్ బాహుబలి గేమ్ రూపొందించే విషయమై డైరెక్టర్ రాజమౌళితో చర్చిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. మార్క్ స్కాగ్స్ ప్రస్తుతం బాహుబలి మొబైల్ గేమ్ ను డెవలప్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి ట్విట్టర్ అధికారిక పేజీ ద్వారా ఈ విషయం స్పష్టం చేసారు. ఆర్కా మీడియా వారితో జరిగిన చర్చల గురించి మార్క్ స్కాగ్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రాజమౌళితో మీటింగ్ అద్భుతంగా అనిపించిందనీ .. ఆయన గొప్ప విజన్ వున్న దర్శకుడనీ.. మంచి స్టోరీ టెల్లర్ అని అన్నారు. ఇలా ‘బాహుబలి’ ప్రాజెక్టులో భాగమవడం ఆనందంగా ఉందని చెప్పారు.


‘బాహుబలి’ అనే మహావృక్షానికి సినిమా కేవలం ఓ కొమ్మ మాత్రమేనని చెప్పిన రాజమౌళి …ఇందులో భాగంగా కామిక్‌బుక్స్‌, వీఆర్‌ మొదలైన వాటిని తీసుకొచ్చారు. త్వరలోనే ‘బాహుబలి’ మొబైల్‌ గేమ్‌ను తీసుకురానునుండటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ 2015లో విడుదలై సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ ఈ ఏడాది ఏప్రిల్‌ 28న విడుదలకు సిద్ధమవుతోంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: