భారత‌దేశానికి వ‌న్నె తెచ్చిన శాస్త్ర‌వేత్త‌ల్లో అబ్దుల్ కలాం ఒక‌రు. ఎక్క‌డో త‌మిళ‌నాడు, రామేశ్వ‌రంలో పుట్టిన ఆయ‌న అంచెలంచెలుగా ఎదిగి భార‌తీయ అణు విభాగానికి కీల‌క మైన శాస్త్ర‌వేత్త‌గా పని చేసి, పోఖ్రాన్ ప‌రీక్ష‌లను స‌ఫ‌లీకృతం చేసిన గొప్ప సైంటిస్ట్‌. భారత రాష్ట్రపతిగా కూడా గొప్ప సేవలు అందించారు. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు మ‌న తెలుగు నిర్మాత‌లు అనీల్ సుంక‌ర‌, సుంక‌ర రామ‌బ్ర‌హ్మం, అభిషేక్ అగ‌ర్వాల్. రాజ్ చెంగ‌ప్ప ర‌చ‌న ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు 'ప్ర‌తి శ‌కంలో ఓ హీరో ఉంటాడు. ప్ర‌తి హీరోకు ఓ క‌థ ఉంటుంది.' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. డ్రీమ్ మ‌ర్చంట్ ఇన్క్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు ఉద‌యం ఇస్రో నేతృత్వంలో 104 శాటిలైట్స్‌ను ఏక కాలంలో ప్ర‌యోగించి ప్ర‌పంచ రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'డా. అబ్దుల్ కలాం' సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: