ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో మంచి విజయాలు సాధించిన శ్రీకాంత్ గత కొంతకాలంగా హీరోగా ఆకట్టుకోలేక పోతున్నాడు. దీంతో విలన్ గా కెరీర్‌ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేకాదు తొలి సినిమానే ఓ సూపర్ స్టార్ కు విలన్ గా నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ రిటైరైన పోలీస్ గా కనిపించనున్నారు. రాశి ఖన్నా ఆయనకు అసెస్టెంట్ గా చేయబోతోంది. 'సుప్రీమ్' చిత్రంలో పోలీస్ గా చేసిన రాశిఖన్నా…మరోసారి సీరియస్ పోలీస్ గా కనిపించనుంది. విశాల్, హన్సిక కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పిభ్రవరి చివరి వారం నుంచి షూటింగ్ మొదలు కానుంది. ఇక శ్రీకాంత్ కు ఈ చిత్రం స్పెషల్ సినిమాగా మారబోతోందని ఇన్ సైడ్ టాక్.
సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్ మొదట్లో విలన్ గా నటించి తర్వాత సాఫ్ట్ హీరోగా మారిన శ్రీకాంత్ ను మరి విలన్ గా ఏ యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తారో చూడాలి.
ఉన్నికృష్ణన్.బి దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించనున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో కూడా విడుదల చేయడానికే నిర్మాతలు తమిళ, తెలుగు సినీ రంగాలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారని వినికిడి. అందులో భాగంగానే శ్రీకాంత్‌ను ఈ సినిమాలో కీలకపాత్రకు సంప్రదించారని టాక్.
Post A Comment: