బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ సర్కిల్స్‌లో గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ విషయాన్ని సైఫ్ అలీ ఖాన్ ధృవీకరించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, సారా అలీ సినీరంగ ప్రవేశం త్వరలోనే ఉంటుందని ప్రకటించాడు. కరణ్ జోహార్ నిర్మాణంలో రానున్న ఓ చిత్రంలో తన కుమార్తె నటించనుందని తెలిపాడు. తన కుమార్తెని సినిమాల్లో పరిచయం చేయడానికి కరణ్ జోహార్ సరైన వ్యక్తి అని సైఫ్ తెలపడం విశేషం. కాగా అలనాటి నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవిని కూడా కరణ్ జోహారే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Post A Comment: