అక్కినేని నాగార్జున హీరోగా ‘ఓం నమో వేంకటేశాయ’ పేరుతో తెరకెక్కిన భక్తిరస చిత్రం నేడు విడుదలయిన విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాను నిన్న రాత్రి హైద్రాబాద్‌లోని సినీ మ్యాక్స్‌లో కొందరు ప్రముఖులకు స్పెషల్ షో వేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు విచ్చేసి సినిమా చూశారు.

చిరు మాట్లాడుతూ... “ఓం నమో వేంకటేశాయ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటి సినిమా. కొన్ని సన్నివేశాలకు కంటతడి పెడుతూనే ఉన్నా. ఇలాంటి సినిమాలు చేయాలంటే మన నాగార్జునకు మాత్రమే సాధ్యం. ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం కూడా దర్శకుడు రాఘవేంద్రరావు గారికే సాధ్యం” అంటూ చిరు, 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఆయనతోపాటు అక్కినేని నాగార్జున, పి‌వి సింధు మరియు ఇతర ప్రముఖులు ఈ సినిమాను చూశారు.

మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తుడు హతిరామ్ బాబా పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో సౌరభ్ జైన్, అనుష్క, ప్రగ్యా జైస్వాల్ నటించారు.
Next
కొత్త పోస్ట్
Previous
This is the last post.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: