హీరోయిన్ అనుష్క 'సైజ్ జీరో' చిత్రం కోసం లావు అయ్యిందనే విషయం కొత్తేమీ కాదు. అయితే ఆ లావు ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ గా మారటం మాత్రం కొంచెం బాధాకరమే. ఎందుకంటే వరసగా ఒక రోజు తేడాలో రిలీజైన 'సింగం 3', 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాలు చూసిన వాళ్లందరూ అనుష్క ఇంత లావు గా ఉందేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయమై నెగిటివ్ టాక్ రావటంతో.. సింగం 3 చిత్రంలో ఆమె పాత్రని కట్ చేసారని తెలుస్తోంది.
సైజ్ జీరో చిత్రం తర్వాత అనుష్క లావు తగ్గడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అనుకున్న రేంజ్ లో మాత్రం లావు తగ్గలేదు. దాని ఫలితం ఇతర సినిమాలపై కూడా పడుతోంది. 'బాహుబలి 2' లో కూడా అనుష్క లావుగానే ఉండబోతుందని అంటున్నారు సినీ జనాలు. కానీ రాజమౌళికి ఆ మాత్రం తెలియదా? ఆ లావుని ఎలా కవర్ చేయాలో అలా చేస్తారని కొందరంటున్నారు.
రీసెంట్ గా 'బాహుబలి 2' పోస్టర్ విడుదల అయిన తర్వాత ఆ పోస్టర్ లో విల్లు ఎక్కుపెట్టిన అనుష్కని చూసి ఇంత స్లిమ్ గా ఎలా ఉందో అని అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి రాజమౌళి సూచించిన విధంగా ఆమె బరువు తగ్గలేకపోయింది. మొన్నమొన్నటి వరకు కూడా అనుష్క ఏ ఫంక్షన్లో చూసినా కొంచెం లావుగానే కనిపించింది. అయితే కొద్ది రోజుల క్రితం బాహుబలి టీమ్ విడుదల చేసిన పోస్టర్ లో మాత్రం అనుష్క చాలా స్లిమ్ గా కనిపించింది.
అలాగే రీసెంట్ గా ‘షో టైం’ మూవీ ఆడియో లాంచ్ కు అనుష్క హాజరయ్యింది. ఆ కార్యక్రమానికి వచ్చిన అనుష్క బాహుబలి పోస్టర్ లో చూపిన దానికి పూర్తి భిన్నంగా ఇంకా కొంచెం బొద్దుగానే కనిపించింది. దీంతో అందరూ 'బాహబలి 2' పోస్టర్ ను గ్రాఫిక్ లో డిజైన్ చేసారని ఫిక్స్ అయిపోతున్నారు. రాజమౌళి గ్రాఫిక్స్ ద్వారా ఆమెను సన్నగా చూపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం భాగమతి తప్ప మరే ఏ చిత్రానికి అనుష్క సైన్ చేయలేదని తెలుస్తోంది. 'బాహబలి 2' సినిమాలో అనుష్క ఎలా ఉందో చూడాలంటే ఆ సినిమా విడుదలయ్యేవరకు ఎదురు చూడక తప్పదంటున్నారు సినీ అబిమానులు.
Post A Comment: