రానా, సంకల్ప్ రెడ్డి, పివిపి కాంబినేషన్‌లో తెరకెక్కిన అండర్‌వాటర్ సబ్ మెరైన్ సినిమా `ఘాజీ`. ఈ సినిమాను చూసిన ప్రఖ్యాత ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, వెంటనే ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి ఖ్యాతి దక్కడం నిజంగానే గ్రేట్. దీని కోసం అమెజాన్ ప్రైమ్ దాదాపు 12.5కోట్లు వెచ్చించింది. తెలుగు, తమిళం, హిందీ భాషలకు కలిపి 7 సంవత్సరాలకు ఈ రైట్స్‌ను చేజిక్కించుకున్నట్లు సమాచారం. రానా, తాప్సీ, కె.కె.మీనన్, ఓంపురి, నాజర్, అతుల్ కులకర్ణి మొదలైన వారు నటించిన ఈ యుద్ధనేపథ్య దేశభక్తి సినిమా రేపు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ చక్కని రేటుకి అమ్ముడుపోయిన ఈ చిత్రం, ప్రీమియర్ షో చూసిన వారి నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.

Post A Comment: