ఆ మధ్యన సంగీత దర్శకుడు జివి ప్రకాష్ హీరోగా నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘త్రిష లేదా నయనతార’ పేరుతో రిలీజైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన మనీషా యాదవ్ ఇప్పుడు బెంగళూరుకు చెందిన బడా వ్యాపార వేత్త వార్నిడ్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పాపెట్టకుండా, గుట్టు చప్పుడు కాకుండా తాళి కట్టించేసుకుంది. ఆఖరికి...తనను హీరోయిన్ గా పరిచయం చేసిన దర్శకుడు బాలాజీ శక్తివేల్ కు కూడా ఈ విషయం చెప్పలేదట.
అయితే మనీషా యాదవ్ రహస్య వివాహంపై ఆమె తల్లి యమున మాత్రం 'ఇరు కుటుంబాల అంగీకరాంతోనే వివాహం జరిగింద'ని తెలిపారు. రహస్య వివాహం అంటూ దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దని ఆమె కోరారు.
అయితే పెళ్లి తర్వాత మనీసా యాదవ్ సినిమాల్లో కంటిన్యూ అవుతుందా? లేక సినిమాలకు దూరం అవుతుందా? అనేది ఆమె భర్త నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని మనీషా యాదవ్ తల్లి యమున తెలిపారు.
Post A Comment: