ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురగదాస్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘కత్తి’ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. దీనిని తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా ‘ఖైదీ నెం.150’ పేరుతో వి.వి వినాయక్ తెరకెక్కించారు. తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు హిందీలోనూ రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోగా బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా అభిమానులు పిలుచుకునే హృతిక్ రోషన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు ఇందులో హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని... ఈ విషయమై సల్మాన్, మురగదాస్‌ల మధ్య చర్చలు కూడా జరిగాయని వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు కూడా వదంతులు వినిపించాయి. కానీ అక్షయ్ చేతిలో వరుస సినిమాలు ఉండడంతో ఇప్పుడు హృతిక్‌ని సంప్రదించినట్లు తెలుస్తోంది. 'కాబిల్' తర్వాత ప్రస్తుతం కబీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియడ్‌వాల నిర్మిస్తున్న చిత్రం అంగీకరించిన హృతిక్, ఆ చిత్రం తర్వాత చేయబోయే సినిమా ఇదే కావచ్చు.

Post A Comment: