తమిళంలో 'తనీ వరువన్', 'బోగన్' లాటి వరస హిట్లతో దూసుకుపోతున్న జయం రవి హీరోగా, శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వంలో నేమిచంద్ జబక్ ప్రొడక్షన్స్ పతాకంపై హితేష్ జబక్ నిర్మిస్తున్న 'టిక్ టిక్ టిక్' చిత్రం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమయ్యింది. 45 రోజుల భారీ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, చెన్నైలో వేసిన భారీ సెట్లో రెండవ షెడ్యూల్ ప్రారంభించుకుంది. ఈ షెడ్యూల్ 38 రోజుల పాటు విరామం లేకుండా జరుగుతుందని, దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. అంతరిక్ష నేపథ్య కథతో వస్తున్న తొలి భారతీయ సినిమా ఇదేనని చెబుతున్నారు. జయం రవితో పాటు నివేథా పెథురాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Post A Comment: