కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌లో దెయ్యం చిత్రాల హవా నడుస్తోంది. కానీ తమిళంలో హర్రర్ కామెడీలు సీజన్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. వరస పెట్టి హర్రర్ కామెడీలు తెర మీదకు దూకుతున్నాయి. ‘ఈ’, ‘డిష్యూం..’, ‘కో’ వంటి భిన్న చిత్రాలతో మెప్పించిన జీవా… ప్రస్తుతం భయపెట్టే కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

'ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌',' ఏ బార్‌ ఆపిల్‌' సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సంగిలి పుంగిలి కదవ తొర’ అని పేరుపెట్టారు. హైక్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జీవా సరసన శ్రీదివ్య నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌ మారింది. ఇప్పటి వరకు యూట్యూబ్‌లో మూడు మిలియన్ల మంది వీక్షించారు.

46 సెకన్ల పాటు సాగే ఈ టీజర్‌.. సినిమాపై అంచనాలను పెంచుతోంది. దీనిపై చిత్ర వర్గాలు స్పందిస్తూ ‘‘ యూట్యూబ్‌లో ఇంతటి ఆదరణ వస్తుందని నమ్మలేదు. జీవా అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడొస్తుందంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జీవా తప్పకుండా విజయం సొంతం చేసుకుంటారనే నమ్మకం ఉంద’’ని తెలిపాయి. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: