తెలుగులో 'ఒంటరి', 'మహాత్మ' వంటి చిత్రాల్లో నటించిన మళయాళీ హీరోయిన్ భావన కిడ్నాప్ కు గురైంది. ఈ విషయమై ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని ఎర్నాకుళంలో సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు 'అతాని' ప్రాంతం వద్ద ఆమె కారును అడ్డుకుని అందులోకి చొరబడి దారి మళ్లించారు. దాదాపు 25 కిలోమీటర్లు కదులుతున్న కారులో ఆమెను లైగింక వేధింపులకు గురిచేశారు.
తరువాత 'పలరివత్తమ్' ప్రాంతంలో కారును ఆపి దుండగులు మరో కారులో పరారయ్యారు. ఘటన తరువాత భావన పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది. దుండగులలో ఒకరు తన వద్ద పనిచేసిన డ్రైవరు మార్టిన్ అని పేర్కొంది. మరొకరు కూడా ఆమె వద్ద పనిచేసిన సునీల్‌గా పోలీసులు గుర్తించారు. మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.కారులో తన చిత్రాలు, వీడియోలు చిత్రీకరించారని భావన పోలీసులకు తెలపడంతో పోలీసులు అపహరణ, వేధింపులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Post A Comment: