బాహుబలి చిత్రం అనంతరం నాలుగేళ్ల విరామం తర్వాత ప్రభాస్ కొత్త చిత్రం అధికారికంగా లాంచ్ అయింది. 'మిర్చి' చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్ బ్యానర్‌లో ‘రన్ రాజా రన్’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నూతన చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇది ప్రభాస్‌కు 19వ చిత్రం. యూవీ క్రియేషన్స్ కార్యాలయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ప్రభాస్‌పై కృష్ణంరాజు క్లాప్ కొట్టగా... దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు రూ.150 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ 'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది.
ఇందులో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్, ఇతర నటీనటులెవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Post A Comment: