నూతన నటుడు ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ చేసిన సినిమా ‘రోగ్’. పూరి తన మొదటి కన్నడ చిత్రం ‘అప్పు’ (తెలుగులో రవితేజ నటించిన 'ఇడియట్' చిత్రం) తో పరిచయం చేసిన ‘పునీత్ రాజ్ కుమార్’ ఆ సినిమాతోనే స్టార్ హీరో అవడం, ‘రోగ్’ చిత్రాన్ని కొంత వరకు చూసిన సల్మాన్ ఖాన్ దాన్ని హిందీలో రీమేక్ చేస్తాననడంతో ఈ సినిమాపై కన్నడ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం కన్నడతోపాటు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో సైతం ఈ చిత్రం మరొక 'ఇడియట్' గా నిలవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
ఇక హీరో ఇషాన్ అయితే ఈ చిత్రం తనను స్టార్ హీరోని చేస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇన్ని అంచనాలు మధ్య ఈరోజు వాలంటైన్స్ డే సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు పూరి. అందులో హీరో ఇషాన్ కాళ్ళకు తాడు కట్టుకుని తల కిందులుగా వేలాడుతూ ప్రేమలో ఉన్న వాళ్లకు అంతా తల కిందులే అని అర్థం వచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ అందరినీ ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకర్షిస్తూ రవితేజ ‘ఇడియట్’ నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ హిట్ ఖాయమనే నమ్మకాన్ని కలిగిస్తోంది.
నిర్మాత సి.ఆర్. మనోహర్ తనయుడు ఇషాన్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు.
Post A Comment: