దర్శకుడు పూరి జగన్నాధ్ గత కొంతకాలంగా అదే కథలను రిపీట్ చేస్తూ వరస ఫ్లాఫ్ లను కొడుతున్నారు. ఇప్పుడు కేవలం కథలే కాదు ట్యాగ్ లైన్స్ కూడా రిపీట్ చేస్తూ తన గత కాల కీర్తితో క్రేజ్ ని క్రియేట్ చేసుకుని, క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు పూరి. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే… పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘రోగ్’ అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇషాన్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదల చేసే దర్శకుడు పూరి జగన్నాథ్. అయితే ఆయన తెరకెక్కించిన ‘రోగ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం గడిచినా విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రేమ కోసం తలకిందులుగా వేలాడే ప్రేమికులకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. పోస్టర్‌లో హీరో తలకిందులుగా వేలాడుతున్నారు. ఈ చిత్రం టైటిల్, దానికి జత చేసిన 'మరో చంటిగాడి ప్రేమ కథ' అనే ట్యాగ్‌లైన్‌తో'ఇడియట్' సినిమాని గుర్తు చేసే ప్రయత్నం చేసారు. ఈ పోస్టర్ అందరినీ, ముఖ్యంగా యువతను విపరీతంగా ఆకర్షిస్తూ రవితేజ ‘ఇడియట్’ నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ హిట్ ఖాయమనే నమ్మకాన్ని కలిగిస్తోంది.
ఈ చిత్రం తెలుగుతోపాటు కన్నడ భాషలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఇడియట్' కన్నడ వెర్షన్ అయిన ‘అప్పు’తో పునీత్ రాజ్‌కుమార్‌ని పూరి జగన్నాథ్ హీరోగా పరిచయం చేసాడు. ఇప్పుడు 'రోగ్'తో నిర్మాత సి.ఆర్. మనోహర్ తనయుడు ఇషాన్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
Post A Comment: