మరాఠీలో ఘన విజయం సాధించిన 'సైరత్' సినిమా ఆధారంగా ఎస్. నారయణ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్, 'జీ టివి' ఆకాష్ చావ్లా సంయుక్తంగా నిర్మిస్తున్న కన్నడ చిత్రం 'మనసు..మల్లిగె..' పాటల విడుదల కార్యక్రమం మంగళవారం రాత్రి బెంగళూరులోని శ్రీ చాముండేశ్వరి స్టూడియోలో జరిగింది. కర్ణాటక నీటి పారుదల శాఖా మంత్రి శ్రీ ఎం.బి.పాటిల్ ఆడియో సీడీని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో ఈ చిత్రంలోని నాలుగు పాటలను, వర్కింగ్ స్టిల్స్‌ను ప్రదర్శించారు. 'నిషాంత్' (ఇతను, దక్షిణాది చిత్రాల్లో విలన్‌గా సుపరిచితుడైన నటుడు సత్య ప్రకాష్ కుమారుడు), 'సైరత్' ఫేం రింకు రాజ్‌గురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 'సైరత్' ఫేం అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో హీరో నిషాంత్, నిర్మాతలు రాక్‌లైన్ వెంకటెష్, ఆకాష్ చావ్లా, చిత్ర దర్శకుడు ఎస్. నారాయణ, ఎంఎల్ఎ మునిరత్న నాయుడు, పాటల రచయిత కవిరాజ్, నటుడు సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: