ఒకప్పుడు తమిళ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నటి, స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక కొంతకాలం క్రితమే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘మొగలిర్ మట్టుమ్’ అనే చిత్రంతో పాటు స్టార్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. సాధారణంగానే బాల సినిమా అంటే ప్రేక్షకుల్లో కాస్త ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలాంటిది జ్యోతిక ప్రధాన పాత్రలో చేస్తుండటంతో ఆ ఆసక్తి ఇంకాస్త పెరిగింది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్, టైటిల్‌ను కొద్దిసేపటి క్రితమే సూర్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు. దీంతో ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం తమిళ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకి ‘నాచ్చియార్’ అనే టైటిల్ ను పెట్టారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జ్యోతికతో పాటు జీవి ప్రకాష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇంకొన్ని వారాల్లోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ చిత్రం బాల గత సినిమాల్లాగే పూర్తి వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది.
Jo you're always blessed and deserve the best!! Can't be more happier to tweet First Look of Bala Anna's #Naachiaar #Jyotika #DirectorBala pic.twitter.com/1yk43mEqAR— Suriya Sivakumar (@Suriya_offl) February 28, 2017
A Bala film , An Ilayaraja musical ... happy to be a part of #Naachiyar ... 🙏🙏🙏🙏 #jyothika pic.twitter.com/1qQiFXO1Be— G.V.Prakash Kumar (@gvprakash) February 28, 2017
Post A Comment: