వర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘కాటమరాయుడు’ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను రికార్డు ధరకు అమ్మినట్టుగా తెలుస్తోంది. అత్యంత భారీ స్థాయిలో ఏకంగా 11.5 కోట్ల రూపాయల ధరకు వీటిని సేల్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా మాస్ ఎంటర్‌టైనరే అయినా, ఓవర్సీస్ విషయంలో ఇంత ధర పలకడం ఆసక్తికరంగా ఉంది. 'సర్దార్ గబ్బర్‌సింగ్' సినిమా భారీగా నష్టాలు తీసుకొచ్చినా, ఇటీవల విడుదలైన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ల మొత్తాన్ని వసూలు చేయడం 'కాటమరాయుడు' బిజినెస్‌కు ఊపునిచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఆ స్థాయి వసూళ్లను సాధించగలిగితే పవన్ సినిమా హిట్టైనట్టే.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: