లాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రంగా పేరు తెచ్చుకొన్న 'ఘాజీ' చిత్రం శాటిలైట్ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అ్యయింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం పై పివీపి వారు పెట్టిన పెట్టుబడి…కేవలం ఒక్క శాటిలైట్ రూపంలోనే వచ్చే విధంగా టీవి ఛానెల్ వారితో చర్చలు జరుపుతున్నట్లు సమచారం. తెలుగు, తమిళ, హిందీ భాషల శాటిలైట్ రైట్స్ ఒకే డీల్‌గా అమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

కలెక్షన్స్ విషయానికి వస్తే… ద‌గ్గుపాటి రానా న‌టించిన ఘాజీ సినిమా రిలీజ్‌కు ముందే ప్రివ్యూల‌తో మంచి టాక్ తెచ్చుకుంది. ఫుల్ ర‌న్‌లో ఘాజీ అన్ని భాష‌ల్లోను క‌లుపుకుని రూ.50 కోట్ల షేర్ రాబ‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. నిజానికి సినిమా రిలీజ్ అయ్యాక స్లో టాక్‌తో స్టార్ట్ అయ్యింది. క్ర‌మ‌క్ర‌మంగా బాక్సాఫీస్ వ‌ద్ద పుంజుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో 'ఘాజీ' ఫ‌స్ట్ వీకెండ్ (తొలి 3 రోజులు) ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.23 కోట్ల గ్రాస్... రూ.12 కోట్ల దాకా షేర్ రాబట్టింది.

ఈ చిత్రానికి మేజర్ షేర్ తెలుగు రాష్ట్రాల నుంచే రావడం విశేషం. ఏపీ, తెలంగాణలో కలిపి తొలి వారాంతంలో ‘ఘాజీ’ రూ.4 కోట్ల షేర్... రూ.6.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాడులో కోటి దాకా వీకెండ్ షేర్ వచ్చింది. ఇండియాలో మిగతా ప్రాంతాలన్నీ కలిపి రూ.5.5 కోట్ల షేర్ వసూలైంది. ఇక అమెరికాలో ప్రీమియ‌ర్ షోల‌కు స్పంద‌న లేక‌పోయినా త‌ర్వాత 'ఘాజీ' పుంజుకుంది. వారాంతం అయ్యేసరికి 4 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసి... హాఫ్ మిలియన్ దిశగా సినిమా దూసుకెళ్తోంది. వీకెండ్ తర్వాత కూడా అన్ని చోట్లా సినిమా స్టడీగా ఉంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: