దుబాయ్ నుండి వచ్చిన మలయాళీ అందం క్యాథరీన్ త్రెసా తెలుగులో బాగానే సినిమాలు చేసింది. లాస్ట్ సమ్మర్ లో 'సరైనోడు' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో చేసినా ఈ అమ్మడికి అస్సలు బ్రేక్ రావటంలేదు. ఈ నేపధ్యంలో తాజాగా ఆమె చేస్తున్న చిత్రంపై ఆశలు పెట్టుకుంది. ఆ సినిమాలో కాస్త రూటు మార్చి నెగిటివ్ రోల్ లో కనపడటానికి ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రానా, కాజల్ కీలక పాత్రల్లో దర్శకుడు తేజ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి’, ‘ఘాజీ’ వంటి విభిన్న చిత్రాలతో దూసుకెళ్తున్న రానా... తేజ దర్శకత్వంలో తాజా చిత్రం చేస్తుండటంతో అంచనాలూ భారీగానే ఉన్నాయి. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు క్యాథరీన్ త్రెసా కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో క్యాథరీన్ చేసేది పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ అని చెప్పుకుంటున్నారు. మీడియా అధిపతిగా… రానాను దెబ్బకొట్టే పాత్రలో మెరవనుందని తెలుస్తోంది. ఇదే విషయం క్యాథరీన్ దగ్గర ప్రస్తావిస్తే ఆమె ఏమంటోందంటే... ."మామూలు కమర్షియల్ హీరోయిన్ గా ఎన్ని పాత్రలు చేసినా కూడా ఒకటే. అదే ఒక నెగెటివ్ రోల్ వస్తే మాత్రం.. మన టాలెంట్ చూపించడానికి చాలా స్కోప్ ఉంటుంది. అందుకే ఈ రోల్ పై నేను ఫుల్ కాన్ఫిడెంటుగా ఉన్నాను" అని చెప్పింది. క్యాథరీన్‌కు ఈ చిత్రం అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.
Post A Comment: