తన గత చిత్రం ‘లక్కున్నోడు’ ఫలితంతో కాస్త నిరుత్సాహానికి గురైన హీరో మంచు విష్ణు ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో తన పాత సక్సెస్ ఫార్ములానే రిపీట్ చేయడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో తనకు ‘దేనికైనా రెడీ', 'ఈడో రకం...ఆడో రకం’ వంటి మంచి కమర్షియల్ విజయాలను అందించిన దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డితోనే తన కొత్త సినిమా చేయనున్నాడట విష్ణు. ఇది కూడా వీరి గత చిత్రాల్లానే పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రమని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఆచారి అమెరికా యాత్ర’ అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గురువు పాత్ర పోషిస్తారని, మంచు విష్ణు ఆయన శిష్యుడిగా కనిపిస్తాడని అనధికార వార్త. ఇప్పటికే ఈ సినిమా తాలూకు స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయమై మరిన్ని ఖచ్చితమైన వివరాలు అధికారికంగా తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే.

Post A Comment: