అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తన రెండవ చిత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు నాగార్జున. కావాల్సినంత గ్యాప్ తీసుకుని బాగా ఆలోచించి తమ కుటుంబానికి మర్చిపోలేని క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ను ఈ సినిమా కోసం తీసుకున్నారు. మొదట్లో విక్రమ్ కుమార్ చెప్పిన కథ నచ్చక రెండవ కథ విన్న నాగార్జున ఆ కథను ఓకే చేశారు. అయితే ఇన్నాళ్లు స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా తెలీక ఎదురుచూస్తున్న అభిమానుల కోసం, సినిమా ప్రారంభం ఎప్పుడో ప్రకటించారు నాగార్జున. ఈ చిత్రాన్ని మార్చి నెలలో మొదలుపెడతారని ఈరోజు జరిగిన ఒక ప్రెస్ మీట్లో ప్రకటించారు. ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ మేఘా ఆకాష్ నటించనుండగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post A Comment: