నందమూరి బాలకృష్ణ 101వ సినిమా గురించి రోజుకో వార్త మీడియా సర్కిల్ లో హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది. ఈ సారి బాలయ్య ఓ ఫ్యాక్షన్ మూవీకి ఓకే చెప్పాడని టాక్. అలాగే ఈ చిత్రం డైరక్టర్ ఎవరూ అంటే…తమిళ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ అని తెలుస్తోంది.
ఈసారి బాలయ్య చేయబోయే చిత్రం ‘సమరసింహారెడ్డి’ తరహాలో అదరగొట్టే ఫ్యాక్షన్ స్టోరీ అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు హీరోయిన్‌గా తమన్నాను, మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్‌ను ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది.
నిజానికి 'గౌతమి పుత్ర శాతకర్ణి' తర్వాత, తన తండ్రి... మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత కథను స్క్రిప్ట్‌గా మార్చే పనిలో పడ్డారు. తండ్రి సినిమాకి పరిశోధనకు ఎక్కువగా టైమ్ పడుతుందని గ్రహించిన బాలయ్య కేఎస్ రవికుమార్ చెప్పిన కథతోనే ముందుకు సాగాలని ఫిక్స్ అయ్యారు. తన 101 సినిమా దర్శకత్వ బాధ్యతలు ఆయనకే ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఫార్ములాతోనే తన 101వ చిత్రం చేసేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నారన్నమాట.
Post A Comment: