నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను ప్రకటించారు. ‘నిన్ను కోరి’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి ఖరారు చేశారు. ఫస్ట్‌లుక్‌ను నాని పోస్ట్ చేస్తూ... ‘వైజాగ్ నుంచి యూఎస్‌ఏ వరకు. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు. లవర్స్ నుంచి పెళ్లైన వాళ్ల వరకు.’ అని ట్వీట్ చేశారు. ‘నిన్ను కోరి’, 'లెట్స్ వెల్‌కమ్ లైఫ్' అనే హ్యాష్‌ట్యాగ్‌లు జత చేశారు.
ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. మార్చి 10 వరకు అమెరికా షెడ్యూల్ వుంటుంది. తర్వాత వైజాగ్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. జులైలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. నివేదా థామస్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్, నీతు, భూపాల్‌రాజ్, కేదార్‌శంకర్, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్ నేహంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్, సంగీతం: గోపీసుందర్, ఫోటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్: చిన్నా, స్టైలింగ్: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి, ప్రొడక్షన్ కంట్రోలర్: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.
Post A Comment: