శతచిత్ర కథానాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది. ఆయన తదుపరి చిత్రం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ విషయాన్ని పూరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'రాకింగ్ అనౌన్స్‌మెంట్. బాలకృష్ణగారు హీరోగా భవ్య క్రియేషన్స్ ఆనంద్‌ప్రసాద్‌గారి నిర్మాణంలో నేను సినిమా చేస్తున్నాను.' అని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి, అగ్ర సంస్థల్లో ఒకటిగా దూసుకెళుతోన్న భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. మార్చి 9న ముహూర్తపు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సినిమాను సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Rocking announcement venture with #NandamuriBalakrishna sir @BhavyaCreations Anand Prasad Garu— PURI JAGAN (@purijagan) February 24, 2017
Muhurtham 👉🏻March 9th
Release 👉🏻 Sept 29th
పవర్‌ఫుల్ డైలాగులంటే తెలుగు ప్రేక్షకులకు ముందు గుర్తొచ్చే స్టార్ హీరో బాలకృష్ణ. ఇక, హీరోయిజమ్‌ను ప్రతి సీన్ సీన్‌కీ పైపైకి తీసుకువెళుతూ, పంచ్ డైలాగులతో థియేటర్‌లోని ప్రేక్షకులకు మాంచి ఫుల్ మీల్స్ అందించే దర్శకుడు పూరి జగన్నాథ్. తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
Post A Comment: