మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ తో టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. టీజర్ మొదలు ట్రైలర్, సినిమా కలెక్షన్ల వరకు అనేక అంశాలు ఆ రికార్డుల లిస్టులో ఉన్నాయి. ఆ రికార్డుల్లో యూట్యూబ్ టీజర్ వ్యూస్ రికార్డ్‌ను తాజాగా పవన్ కళ్యాణ్ బీట్ చేయడం జరిగింది. చిరు ‘ఖైదీ నంబర్ 150’ టీజర్ ను రికార్డు స్థాయిలో సుమారు 7.41 మిలియన్ల మంది వీక్షించగా ఈ మధ్యే విడుదలైన ‘కాటమరాయుడు’ టీజర్ ను 7.74 మిలియన్ల మంది చూశారు. దీంతో ఇప్పటిదాకా టాలీవుడ్ లో నిర్ణీత సమయంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా ‘కాటమరాయుడు’ రికార్డ్ సృష్టించింది. ఈ రికార్డ్ విషయంలో రెండవ స్థానంలో ‘ఖైదీ నంబర్ 150’ ఉండగా, 6.6 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానంలో రజనీకాంత్ ‘కబాలి’ నిలిచింది.

ప్రస్తుతం పోరాట సన్నివేశాలు, పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ‘కాటమరాయుడు’ చిత్రాన్ని మార్చి నెలాఖరున రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: