హీరో విజయ్ తన 62వ సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ ఎవరో అన్నది తెలిసింది. అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట. ఇదే కనుక నిజమైతే సోనాక్షికి ఇది రెండవ తమిళ సినిమా అవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ 'లింగా' సోనాక్షి నటించిన మొదటి తమిళ సినిమా.
అలాగే దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్‌తో్ సోనాక్షి ఇంతకుముందు 'హాలిడే', 'అకీరా' అనే రెండు హిందీ సినిమాలు చేశారు.
Post A Comment: