ప్రముఖ నటుడు కమల్‌హాసన్ పెద్ద సోదరుడు చంద్రహాసన్‌ (82) కన్నుమూశారు. లండన్‌లో ఉంటున్న ఆయన శుక్రవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వృత్తిపరంగా న్యాయవాది అయిన చంద్రహాసన్‌ ప్రస్తుతం కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌’కి అధినేతగా వ్యవహరిస్తున్నారు. జనవరిలో చంద్రహాసన్‌ భార్య గీతామణి చనిపోయారు. ‘విశ్వరూపం’ సినిమా విడుదల విషయంలో ఆటంకాలు వచ్చినప్పుడు చంద్రహాసన్‌ తన వెంటే ఉండి ధైర్యం చెప్పారని, ఆయనే తన బలమని కమల్‌హాసన్‌ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన పెద్ద సోదరుని ప్రోత్సాహం లేకపోతే ఇన్ని మంచి సినిమాలు చేసుండేవాడ్నే కాదని కమల్‌ తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: