ప్రముఖ నటి భావన కన్నడ సినీ నిర్మాత నవీన్‌తో గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. కొందరు అతిథుల మధ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేశ్ బాలా తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా పెళ్లి తేదీని నిర్ణయించలేదని ట్వీట్ చేశారు. భావన, నవీన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని భావన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాము 2014లోనే వివాహం చేసుకోవాలనుకున్నామని, కానీ వృత్తిపరంగా ఉన్న నిబద్ధతల వల్ల కుదరలేదని అప్పట్లో ఆమె అన్నారు. నవీన్ నిర్మించిన కన్నడ చిత్రం 'రోమియో' లో భావన నటించింది. ‘మహాత్మ’, ‘ఒంటరి’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన భావన అనేక కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు.
Actress #Bhavana got engaged to Kannada Producer #Naveen at a simple ceremony earlier today.. Wedding date yet to be fixed.. Congratulations pic.twitter.com/5r3Zmo4TrC— Ramesh Bala (@rameshlaus) March 9, 2017
Post A Comment: