దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను ఏప్రిల్ 5 నుండి ప్రారంభమవుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ ముస్కాన్ ను ఫైనల్ చేసిన పూరి, మరో ఇద్దరు హీరోయిన్లను కూడా సెలక్ట్ చేశాడట. వాళ్లలో ఒకరు అమలాపాల్ అని సమాచారం. అమలాపాల్ ఇప్పటి వరకు బాలయ్య సరసన నటించకపోవడంతో వారి జోడీ స్క్రీన్ మీద ఫ్రెష్ గా అనిపిస్తుందని, పైగా అమలాపాల్ గతంలో తను డైరెక్ట్ చేసిన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో నటించి ఉండటంతో ఆమెను ఖాయం చేశాడట పూరి. ఇక మరొక హీరోయిన్‌గా ఛార్మి నటించే అవకాశాలు ఉన్నాయని వినికిడి.
అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అఫిషియల్ కన్ఫర్మేషన్ అందలేదు. బాలకృష్ణ కొత్త లుక్ తో గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సెప్టెంబర్ 29 వ తేదీని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు.
Post A Comment: