Amitabh Bachchan 'Sarkar 3', Ram Gopal Varma's 'Sarkar 3', 'Sarkar 3' Trailer, Hindi Movie 'Sarkar 3', Big B in 'Sarkar 3'

బాలీవుడ్‌లో వ‌ర్మ దాదాపు రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా 'స‌ర్కార్ 3' ట్రైల‌ర్ తాజాగా విడుద‌లైంది. అయితే ఈ ట్రైలర్ చూడగానే ఆయన పాత ఇమేజ్ మళ్లీ వచ్చేసినట్లైంది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. 'గాయపడిన సింహం మరింత ప్రమాదకరం' అంటూ సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో చాలా ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే వర్మ ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేశాడు. సర్కార్ మనవడు శివాజీ పాత్రలో అమిత్ సాద్ కనిపిస్తాడు. గోవింద్ దేశ్‌పాండే పాత్రలో రెబల్‌గా మనోజ్ బాజ్‌పాయి, అను పాత్రలో వెన్నుపోటు పొడిచే హీరోయిన్ యామీ గౌతమ్, వాల్యా అనే పాత్రలో సర్కార్‌కు వ్యతిరేకంగా ఉండే జాకీ ష్రాఫ్ కనిపిస్తారు.  ట్రైలర్ చివరలో ఈ చేతులతోనే చంపుతా అనే సుభాష్ నాగ్రే మాటలు 'సర్కార్ -3'కి మరో భాగం ఉంటుందనే అనుమానాన్ని అభిమానులలో కలిగిస్తోంది.


రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన 'సర్కార్‌', 'సర్కార్‌ రాజ్‌' చిత్రాలు అప్పట్లో మంచి హిట్ అయ్యి, డబ్బులు తెచ్చి పెట్టాయి. ఇప్పుడు ‘సర్కార్‌-3’ని రూపొందించి హిట్ కొట్టే పనిలో ఉన్నారాయన. తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకునే యువతిగా అను కర్కారే పాత్రలో యామీ గౌతమ్ నటిస్తున్నట్లు వెల్లడించారు. యామీ పాత్ర ఆకట్టుకుటుందని ఆయన తెలిపారు.

అలాగే... ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో వారి పాత్రల పేర్లతో సహా వర్మ గతంలో వెల్లడించారు.

అమితాబ్‌ బచ్చన్‌ - సుభాష్‌ నాగ్రే పాత్రలో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు.
యామీ గౌతమ్‌ - తండ్రిని చంపిన సర్కార్‌పై పగతీర్చుకునే యువతి అన్ను కర్కారే పాత్రలో నటిస్తోంది.
మనోజ్‌ బాజ్‌పాయ్‌ - గోవింద్‌ సర్కార్‌కి శత్రువుగా గోవింద్‌ దేశ్‌పాండే పాత్రలో నటిస్తున్నారు.
రోనిత్‌ రాయ్‌ - సర్కార్‌కి కుడి భుజంగా గోకుల్‌ సతమ్‌ పాత్ర పోషిస్తున్నారు.
అమిత్‌ సాధ్‌ - పొగరు, వాలటైల్‌ ఉండే శివాజీ అలియాస్‌ చీకూ పాత్రలో నటిస్తున్నారు.
జాకీ ష్రాఫ్‌ - సర్‌ అనే పాత్రలో జాకీ నటిస్తున్నారు.
భరత్‌ దబోల్కర్‌ - గోరఖ్‌ రాంపూర్‌ అనే మంత్రి క్యారెక్టర్‌ చేస్తున్నారు.
రోహిణి హట్టంగడి - రుక్కు బాయ్‌దేవి అనే విలన్‌ పాత్రలో రోహిణి కన్పించనున్నారు.

సినిమా స్టోరీలో చాలా మార్పులు చేయడంతో ఇందులో అభిషేక్‌, ఐశ్వర్యలు నటించడంలేదట. తొలిరెండు భాగాల కంటే భావోద్వేగభరితంగా సాగే చిత్రమిదని అమితాబ్‌బచ్చన్ పేర్కొన్నారు. ఏప్రిల్ 7న రామ్ గోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: