దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత దృశ్యకావ్యం... ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. త్వరలోనే ఇందులోని పాటలు విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా ‘బాహుబలి 2’లోని ట్రాక్ లిస్ట్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. మొత్తం అయిదు పాటలను సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచారు. ఇందులో మూడు పాటలకు కీరవాణి సాహిత్యం అందించగా, ఒక పాటను చైతన్య ప్రసాద్ రచించారు. మరో పాటకు కె.శివశక్తిదత్త, డాక్టర్ కె.రామకృష్ణలు సాహిత్యం అందించారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘బాహుబలి ది: కన్‌క్లూజన్’ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బాహుబలి: ది బిగినింగ్’కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Here's the #Baahubali2 Audio Track List 👍— Lahari Music (@LahariMusic) March 20, 2017
Music by @mmkeeravaani 🎼
Audio on @LahariMusic 🎵
Subscribe 👉 https://t.co/XMhGg9i6eQ pic.twitter.com/Noyqs03sxl
Post A Comment: