ర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి- 2’ ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ రోజు (మార్చి 26న) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కోసం రాజమౌళి ఈ చిత్రం షూటింగ్ కోసం రూపొందించిన మాహిష్మతి సామ్రాజ్యపు సెట్‌ను వినియోగిస్తున్నారు. అంతేగాక ఎన్నడూ లేని విధంగా 360 డిగ్రీల కోణంలో లైవ్ స్ట్రీమింగ్ అందించనున్నారు. అందుకోసం బెస్ట్ టెక్నికల్ టీమ్ తో వర్క్ చేయిస్తున్నారు.

చిత్రంలోని మొత్తం ఐదు పాటలను ఈరోజే విడుదల చేయనున్నారు. తెలుగు చానెళ్ళతో పాటు జాతీయ స్థాయి మీడియా చానెళ్ళు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయనున్నాయి. అభిమానులైతే సాయంత్రం 5గంటల నుండి ఈ వేడుకను జక్కన్న ఎలా ప్లాన్ చేశారో చూడాలని ఉవ్విళూరుతున్నారు. సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం సినీ అభిమానులంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లో ఉన్న ఈ క్రేజ్ ను గమనించిన తెలుగు న్యూస్ ఛానెల్స్ టీవీ9, ఎన్టీవీలు సుమారు రూ. 75 లక్షల రూపాయలు చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కుల్ని దక్కించుకున్నాయట. ఇది కూడా బాహుబలి ఖాతాలో ఒక రికార్డ్ అనే చెప్పాలి. ఈ వేడుక ప్రసారంతో తమ చానెళ్ల టీఆర్ఫీ రేటింగ్స్ బాగా పెరిగే అవకాముంది కనుక ఛానెల్స్ ఇంత పెద్ద మొత్తం ఆఫర్ వెచ్చించాయి.

ఈ వేడుకకు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్, ఇతర సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: