భారీ ఎదురుచూపుల నడుమ ‘బాహుబలి – ది కంక్లూజన్’ ట్రైలర్ నిన్న ఉదయం 9 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలకు 24 గంటల ముందు నుండే ఎదురుచూస్తూ కూర్చున్న అభిమానులు సోషల్ మీడియాలో ట్రైలర్ విడుదలవ్వగానే సందడి మొదలుపెట్టారు. కొద్దిసేపటికే ఈ ట్రైలర్ ట్విట్టర్లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయి రికార్డ్ సృష్టించింది. అలాగే బాహుబలి హవా ముందు పాత హాలీవుడ్ సినిమాల రికార్డులు సైతం చిన్నబోయాయి. పూర్తిగా 24గంటలు కూడా గడవక ముందే ఈ ట్రైలర్ 21.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప ఆదరణ దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమా ట్రైలర్ ఇదే కావడం విశేషం. 'బాహుబలి – 1' భారీ విజయంగా నిలవడం, అన్ని సినీ పరిశ్రమల్లోని ప్రేక్షకుల్లో సినిమాపై ఎడతెగని ఉత్కంఠ నెలకొని ఉండటం, ట్రైలర్ చాలా గొప్పగా, అంచనాలకు మించి ఉండటం, రాజమౌళి విజువల్ విజన్ పై తారా స్థాయి అంచనాలు ఉండటంతో ఊహకందని క్రేజ్ ఈ సినిమా సొంతమైంది. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
Post A Comment: