2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

మరో ప్రక్క 'బాహుబలి 2 (ద కంక్లూజన్) ' రిలీజ్ కు ముందే రికార్డులు బ్రద్దలు కొడుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నైజాం రైట్స్ ను ఏసియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్‌లు 40 కోట్లకు దక్కించుకున్నారు.

అంతే కాకుండా ‘బాహుబలి2’ చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ ను సోనీ టీవీ 51కోట్లకు దక్కించుకుంది. ఈ మొత్తానికి సర్వీస్ ట్యాక్స్ లు అదనం. 'బాహుబలి - ద బిగినింగ్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులను కొల్లగొట్టడంతో పార్ట్ 2కు మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో 'బాహుబలి' కోసం మార్కెట్ వర్గాలు క్యూ కడుతున్నాయి. ప్రీ రిలిజ్ బిజినెస్ దుమ్మురేపుతోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ‘బాహుబలి 2’ చిత్రం ప్రీమియర్‌ షోను ముందుగా క్వీన్‌ ఎలిజబెత్‌-2 చూడనున్నట్లు సమచారం. స్వతంత్ర భారతదేశం 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌ 24న బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘ఇండియా ఆన్‌ ఫిల్మ్‌’ కార్యక్రమంలో పలు భారత సినిమాలను ప్రదర్శించనుంది. ఇందులో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ షోకు క్వీన్‌ ఎలిజబెత్‌-2, ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: