ప్రస్తుతం ‘బాహుబలి 2’ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఆడియో వేడుక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల 28వ తేదీన ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. మొదటి భాగానికి చెందిన ఆడియోను తిరుపతిలో ఆవిష్కరించారు. దాంతో రెండవ భాగానికి చెందిన ఆడియోను వైజాగ్ లో రిలీజ్ చేయవచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ని హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ‘మాహిష్మతి రాజ్యం’ సెట్లోనే జరపాలని రాజమౌళి ఆలోచన చేస్తున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. అలా చేస్తే… ఈ సినిమా కోసం వేసిన సెట్స్‌ను చూసే అవకాశాన్ని చాలామందికి కల్పించడం జరుగుతుందని, దాంతో సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు మాత్రం… అలా తమ సినిమాలో కీలకంగా నిలిచిన సెట్‌ను… సినిమా రిలీజ్ కాకుండానే జనాలు లైవ్ లో చూడటంతో సినిమాపై ఆసక్తి తగ్గే అవకాశం ఉందా అనే కోణంలో డిస్కస్ చేస్తున్నారట. అయితే రాజమౌళి మాత్రం ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరపడానికి ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. మరి ఏ వేదికను ఫిక్స్ చూడాలి.
మరో ప్రక్క 'బాహుబలి' సినిమాని రాజమౌళి గ్రేటెస్ట్ వర్క్‌గా ఒప్పుకోని విమర్శకులు ఇంతకాలం అది మార్కెటింగ్ విజయంగా అభివర్ణిస్తూ వస్తున్నారు. అలాంటి ఈ సమయంలో అందరికీ ‘బాహుబలి 2’ గట్టి సమాధానం ఇస్తుందని, ఈ చిత్రంలో ఎమోషన్స్ పీక్స్‌లో వుంటాయని, బాహుబలిలో మిస్ అయిందని చెప్పుకున్న హీరోయిజం ఇందులో పుష్కలంగా వుంటుందని ఆ చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా వుంది.
Post A Comment: