దిల్ రాజు నిర్మాతగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘నేను లోకల్’ పెద్ద హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిర్మాతతో నాని మరో చిత్రం చేస్తున్నారు. ‘నేను లోకల్’ నిర్మించిన దిల్‌రాజే ‘నాని నెక్ట్స్ ఏం చేయబోతున్నాడంటే?’ అంటూ ‘ఎమ్.సి.ఎ’ అనే పేరుని ప్రకటించాడు. దాంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది.
‘నేను లోకల్’ చిత్రంలో బీటెక్ తర్వాత ఎంబీఏలో జాయిన్ అయిన స్టూడెంట్‌గా సందడి చేసిన నాని, ఈసారి ఎంసీఏ స్టూడెంట్‌గా కనిపిస్తాడా? మరోసారి కూడా ఆయన పుస్తకాలు చేతపట్టి కాలేజీకి వెళ్లనున్నాడా? అనే డౌట్స్ అందరికీ వచ్చాయి. ఇప్పుడు ఎట్టకేలకి ఆ సందేహాలకి జవాబు దొరికింది. నాని తదుపరి చేయబోయే ‘ఎంసీఏ’ అనే సినిమాకి అర్థం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అని! అంటే లోకల్ కుర్రాడు అని క్లారిటీ వచ్చేసింది. ఆ చిత్రం వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది.
ప్రస్తుతం నాని ‘నిన్ను కోరి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన వెంటనే ‘ఎంసీఏ’ని పట్టాలెక్కనుంది. ఆ చిత్రంలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటించే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఇది కాకుండా నాని ఇంకో ప్రాజెక్టుకి రెడీ అవుతున్నాడు. తనకు ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ లాంటి సక్సెస్‌ను అందించిన దర్శకుడు హను రాఘవపూడితో ఈ సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస్ ప్రసాద్, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనుండగా, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు పనిచేసిన యువరాజ్ సినిమాటోగ్రఫీ చేయనున్నారు.
Post A Comment: