ఇప్పటికే పలు రికార్డుల్ని బద్దలు కొట్టిన ‘బాహుబలి 2’ ట్రైలర్ తాజాగా అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్ లైక్స్ పొంది ప్రపంచస్థాయి రికార్డ్ సృష్టించింది. అంతేగాక వరల్డ్ వైడ్ గూగుల్ ట్రెండింగ్స్ లో కూడా టాప్ లో నిలిచింది. అందుకే గూగుల్ ఇండియా తనదైన స్టయిల్ లో ఈ వార్తను సెలబ్రేట్ చేసింది. ఈ వారం వరల్డ్‌వైడ్ ట్రెండింగ్స్‌లో టాప్‌లో నిలిచిన బాహుబలి, ఐన్ స్టీన్, హొలీ కలిపి ఒక వీడియోను తయారుచేసింది. అందులో బాహుబలి పాత్రకు ఐన్ స్టీన్ కాస్ట్యూమ్స్, కళ్ళజోడు తగిలించి పక్కనే ఐన్ స్టీన్ ఫార్ములాను కూడా ఉంచి ఒక జీనియస్ మైండ్ యుద్ధ వీరుడి గుండెతో కలిస్తే కలర్‌ఫుల్‌గా ఉంటుంది అంటూ హోలీ రంగుల్ని కూడా చల్లింది. ఇలా బాహుబలికి తనదైన స్టయిల్ లో మేకోవర్ ఇచ్చింది గూగుల్. ఒక ట్రైలర్ ట్రెండింగ్‌ను గూగుల్ ఇండియా ఇలా ప్రెజెంట్ చేయడం ఇదే మొదటిసారి.
The mind of a genius met the heart of a warrior. It was always going to be a colourful encounter. #GoogleTrends #Bahubali2 #Einstein #Holi pic.twitter.com/hrUqXu0BUT— Google India (@GoogleIndia) March 18, 2017
Post A Comment: