పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ విడుదలకు దగ్గరయ్యే కొద్దీ ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క నైజాం హక్కులు రూ.20 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌కు నైజాం ఏరియాలో మంచి పట్టు ఉండటం, సినిమాపై భారీ అంచనాలుండటంతో కొనుగోలుదారులు ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడానికి సిద్దమయ్యారట. మామూలుగా ఇంత పెట్టుబడిని వెనక్కి రాబట్టాలంటే కొంచెం కష్టమైన పనే. కానీ పవన్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇదేమంత పెద్ద టార్గెట్ కాదు. ఒక్క నైజాం ఏరియాలోని కాక చాలా ప్రాంతాల్లో ఈ సినిమా హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది.
అలాగే... ఈ చిత్రం శాటిలైట్ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు టీవీ ఛానెల్... జెమినీ టీవీ వారు 'కాటమరాయుడు' శాటిలైట్ రైట్స్‌ను కైవసం చేసుకున్నారు. దాదాపు రూ.12.5 కోట్లకు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.
నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కిశోర్ కుమార్ పార్దసాని (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 24న రిలీజ్ చేయనున్నారు. మార్చి 18న హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు.
Post A Comment: