బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కవలలకు తండ్రయ్యారు. సరోగసీ పద్ధతి ద్వారా మగ, ఆడ శిశువుకు తండ్రైన కరణ్ తన ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పిల్లలకు రోహి, యశ్ అని పేర్లు పెట్టినట్లు తెలిపారు. తన జీవితానికి రెండు అత్యంత అద్భుతమైన చేర్పులు జరిగాయని ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. తన పిల్లలే తన ప్రపంచమని, తొలి ప్రాముఖ్యత వారికేనని కరణ్ అన్నారు. తన పనులు, ప్రయాణాలు, సామాజిక వాగ్దానాలను వెనక్కు నెట్టుతున్నట్లు చెప్పారు. తన జీవిత కలను సాఫల్యం చేసిన సర్రోగేట్ తల్లికి, వైద్య సిబ్బందికి కరణ్ ధన్యవాదాలు చెప్పారు. ఈ ఇద్దరు పిల్లలు గత నెల ముంబయిలోని మస్రాణి ఆసుపత్రిలో పుట్టారు. ఇదే ఆసుపత్రిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ మూడో సంతానం అబ్రామ్ సరోగేట్ తల్లి ద్వారా పుట్టాడు.
— Karan Johar (@karanjohar) March 5, 2017
Post A Comment: