హరీష్ శంకర్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’ పేరుతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉండగానే బన్నీ తన తర్వాతి సినిమాను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ‘రేసు గుర్రం', 'టెంపర్’ వంటి సూపర్‌హిట్ సినిమాలకు రచయితగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ డైరెక్ట్ చేయనున్నఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి, ఇటీవలే ‘ధోనీ’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కియర అద్వానీని అనుకుంటున్నారట. ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నాయని ఒకవేళ ఆమె డేట్స్ దొరక్కపోతే పూరి ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పఠానిని తీసుకోవాలనే ముందస్తు ప్లాన్ కూడా రెడీగా ఉందట. మరి వీరిద్దరిలో బన్నీకి హీరోయిన్ గా ఎవరు సెట్ అవుతారో చూడాలి. ఈ చిత్రం
అంతేగాక ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రానికి ‘నా పేరు సూర్య’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఇందులో కాస్త దేశభక్తి సారాంశం కూడా ఉంటుందని సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Post A Comment: