ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ‘చెలియా..’ చిత్రం పాటలు విడుదలయ్యాయి. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరపరిచిన ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం మంగళవారం (మార్చి 21) హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కార్తీ, అదితిరావు హైదరి, మణిరత్నం, సుహాసిని, ఎ.ఆర్‌. రెహమాన్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వంశీ పైడిపల్లి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి రెండో ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎ.ఆర్‌. రెహమాన్‌ మాట్లాడుతూ ‘తమిళ సినిమాకి తెలుగు వెర్షన్ చేసిన ప్రతిసారి తమిళ పాటల కంటే తెలుగు పాటలే బాగా వచ్చాయని అనిపిస్తుంది. తెలుగు భాష అంత తియ్యగా ఉంటుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలన్నీ ఒక్కటిగా కలిసి పనిచేసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి బాగా పెరిగింది. ఇక్కడ 'బాహుబలి' ఉంది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది ఈ చిత్రం. సంవత్సరానికి నాలుగు బాహుబలులు రావాలని కోరుకుంటున్నాను. తెలుగు, తమిళం, హిందీ, ఇతర పరిశ్రమలన్నీ కలిసి పనిచేస్తే గొప్ప గొప్ప సినిమాలు చాలా వస్తాయి’ అన్నారు. అలాగే మణిరత్నం తనకు సోదరుడి లాంటి వారని, తనతో 25 ఏళ్ల ప్రయాణానికి ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

ఈ చిత్రంలో కార్తీ పైలెట్‌గా, అదితి వైద్యురాలిగా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ‘చెలియా..’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: