అభిమానుల 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘ఖైదీ నెం. 150’. ఈ చిత్రం సాధించిన ఘన విజయం చిరంజీవిని మళ్ళీ నెం.1 స్థానంలో కూర్చోబెట్టింది. ఈ అపూర్వ విజయంతో అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. జనవరి 11న రిలీజైన ఈ సినిమా ఈరోజుతో 53 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ 50 రోజుల పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.105 కోట్ల షేర్ వసూలు చేసింది. చిత్ర నిర్మాతల లెక్కల ప్రకారం బాహుబలి తర్వాత 100 కోట్ల షేర్ మార్క్ దాటిన చిత్రం ఇదే కావడం విశేషం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు ఈ అర్థ శత దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇకపోతే చిరు తన 151వ సినిమాగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే చిత్రాన్ని చేయనుండగా దీనికి కూడా చరణే నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
Post A Comment: