టాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకం గా భావించే నంది అవార్డుల కేటగిరిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2012 - 2013 సంవత్సరాల నంది అవార్డు ల వివరాలను శ్రీమతి జయసుధ, కోడి రామకృష్ణ మీడియాకి తెలియజేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో మురళీమోహన్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక 2012 సంవత్సరానికిగాను 'ఈగ' చిత్రం ఎక్కువగా నందులను తన్నుకుపోగా... 2013 సంవత్సరానికి 'మిర్చి' చిత్రం ఎక్కువగా నందులని గెలుచుకుని టాప్ పొజిషన్‌లో నిలబడింది. 2012 మరియు 2013 సంవత్సరాల నంది అవార్డుల వివరాలు మీకోసం.
సం. 2012 నంది అవార్డులు
మొదటి ఉత్తమ చిత్రం - ఈగ
రెండో ఉత్తమ చిత్రం - మిణుగురులు
ఉత్తమ కుటుంబ కథా చిత్రం - ఇష్క్
పాపులర్ చిత్రం - జులాయి
ఉత్తమ నటుడు - నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటి - సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (ఈగ)
ఉత్తమ సహాయనటుడు - అజయ్ (ఇష్క్)
ఉత్తమ విలన్ - సుదీప్ (ఈగ)
ఉత్తమ సినీ విమర్శకుడు - మామిడి హరికృష్ణ
ఎస్వీ రంగారావు అవార్డు - ఆశీష్ విద్యార్థి (మిణుగురులు)
అల్లు రామలింగయ్య అవార్డు - రఘుబాబు (ఓనమాలు)
ఉత్తమ కొత్త దర్శకుడు - అయోధ్య కుమార్ (మిణుగురులు)
ఉత్తమ స్క్రీన్ప్లే - రాజమౌళి (ఈగ)
ఉత్తమ కెమెరామ్యాన్ - సెంథిల్ కుమార్
ఉత్తమ సంగీత దర్శకులు - ఇళయరాజా, ఎంఎం కీరవాణి
ఉత్తమ గాయకుడు - శంకర్ మహదేవన్
ఉత్తమ గాయకురాలు - గీతామాధురి
ఉత్తమ ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
ఉత్తమ డ్యాన్స్ మాస్టర్ - జాని
ఉత్తమ స్టంట్ మాస్టర్ - గణేశ్
సం. 2013 నంది అవార్డులు
ఉత్తమ చిత్రం - మిర్చి
రెండో ఉత్తమ చిత్రం - నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం - ఉయ్యాల జంపాల
కుటుంబకథాచిత్రం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ నటుడు - ప్రభాస్ (మిర్చి)
బెస్ట్ పాపులర్ చిత్రం - అత్తారింటికి దారేది
ఉత్తమ నటి - అంజలి పాటిల్ (నా బంగారు తల్లి)
సహాయనటుడు - ప్రకాశ్ రాజ్(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
సహాయనటి - నదియా (అత్తారింటికి దారేది)
ఎస్వీ రంగారావు అవార్డు - నరేశ్
అల్లు రామలింగయ్య అవార్డు - తాగుబోతు రమేశ్
ఉత్తమ విలన్ - సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ దర్శకుడు - కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ రచయిత - మేర్లపాక గాంధీ
ఉత్తమ కథా రచయిత - ఇంద్రగంటి మోహనకృష్ణ
ఉత్తమ మాటల రచయిత - త్రివిక్రమ్ శ్రీనివాస్
ఉత్తమ గేయ రచయిత - సిరివెన్నెల
ఉత్తమ సంగీత దర్శకుడు - దేవీశ్రీప్రసాద్
ఉత్తమ తొలి దర్శకుడు - కొరటాల శివ
జాతీయ సమగ్రత చిత్రం డాక్యుమెంటరీ ఫిలిం - భారత కీర్తి మూర్తులు
Post A Comment: