క చిత్రానికి అవార్డు ప్రకటించిన తర్వాత, పొరపాటున ప్రకటించామని అంటే ఉవ్వెత్తున ఎగసిన ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. 89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా జరిగిన ఇలాంటి ఘటనతో ‘లా లా ల్యాండ్‌’ చిత్ర బృందం ఒక్కసారిగా నిరాశలోకి జారిపోయింది. చిరు నవ్వులు చిందిన మోములు కళా విహీనం అయిపోయాయి. అయితే వెంటనే తేరుకున్న ‘లా లా ల్యాండ్‌’ చిత్ర బృందం అవార్డును గెలుచుకున్న ‘మూన్‌లైట్‌’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ వేదికకు వీడ్కోలు పలికారు.

ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్సవం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇటువంటి ఘ‌ట‌నే చోటుచేసుకోలేదు. ప్ర‌పంచ దేశాల ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా చూసే ఆ కార్య‌క్ర‌మం వేదిక‌పై జ‌రిగిన హై డ్రామా ప‌ట్ల నిర్వా‌హకులు సీరియ‌స్ అయ్యారు. అందుకు కార‌ణ‌మైన ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అకౌంటెంట్లుగా ప‌నిచేస్తోన్న బ్రియాన్ క‌ల్లిన‌న్‌, మార్తా రుయిజ్‌ల‌ను అకాడ‌మీ ఉద్యోగాల నుంచి తొలిగించిన‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే…!

అప్పటికే దాదాపు కీలక అవార్డులన్నీ ప్రకటించేశారు. ‘లా లా ల్యాండ్‌’ ఖాతాలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి సహా మరో నాలుగు అవార్డులు వచ్చి పడ్డాయి. ఇక అందరూ ఆసక్తిగా ఉత్తమ చిత్రం ప్రకటన కోసం ఎదురు చూస్తుండగా వ్యాఖ్యత ‘లా లా ల్యాండ్‌’ అంటూ ప్రకటించారు. దీంతో ఆ చిత్ర బృందం ఆనందానికి అవధులు లేవు. అందరూ ఒక్కసారిగా ఆస్కార్‌ వేదికపైకి ఎక్కేశారు. కానీ అప్పటికే పొరపాటు జరిగిపోయింది.

వెంటనే గుర్తించిన నిర్వాహకులు అసలు విషయాన్ని ప్రకటించడంతో వేదికపై ఉన్న ‘లా లా ల్యాండ్‌’ చిత్ర బృందం డీలా పడిపోయింది. ‘మూన్‌లైన్‌’ ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, నిర్వాహకులు ఒక కవరుకు బదులు మరొక కవరు ఇవ్వడంతోనే తప్పుగా ప్రకటించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. దీంతో ‘మూన్‌లైట్‌’ ఒక్కసారిగా వెలుగులీనింది. ఆ చిత్ర బృందం కూడా వేదికపై రావడంతో ‘లా లా ల్యాండ్‌’ బృందం వారికి శుభాకాంక్షలు చెబుతూ కిందకు దిగేశారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: