Actor Jayasudha’s husband Nitin Kapoor allegedly commits suicide in Mumbai | Jayasudha's husband Nitin Kapoor

ప్రముఖ సినీనటి జయసుధ భర్త, నిర్మాత నితిన్‌ కపూర్‌(58) మంగళవారం, మార్చి 14న ముంబై-అంధేరీ వెస్ట్‌లో ఆయన ఉంటున్న అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. అనుమానాస్ప‌దంగా మారిన ఈ మ‌ర‌ణంపై ప్ర‌స్తుతం పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నితిన్‌ కపూర్‌ మృతి విషయం తెలిసిన వెంటనే జయసుధ హైదరాబాద్‌ నుంచి ముంబై బయలుదేరారు. 1985లో జయసుధతో నితిన్‌కపూర్‌ వివాహం జరిగింది. వీరికి నిహార్‌, శ్రేయాన్‌ ఇద్దరు కుమారులు. శ్రేయాన్‌ ఇటీవలే ‘బస్తీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. నితిన్‌ కపూర్‌ బాలీవుడ్‌ నటుడు జితేంద్రకు వరుసకు సోదరుడు.

నితిన్‌క‌పూర్ ఇటీవ‌లి కాలంలో మాన‌సిక వ్య‌ధ‌తో బాధ‌ప‌డుతున్నారు. కోకిలాబెన్‌లోని సైక్రియాటిస్టుల స‌మ‌క్షంలో చికిత్స కొన‌సాగుతోంది. 18ఏళ్లుగా ఎలాంటి వ్యాప‌కం లేక‌పోవ‌డం త‌న‌ని డిప్రెష‌న్‌లోకి దింపింద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. అయితే... హిందీ సినిమాల నిర్మాణం క‌లిసిరాక అప్పుల్లో కూరుకుపోయిన నితిన్ ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల‌నే ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటార‌ని అనుమానిస్తున్నారు. నితిన్ జేఎస్‌కే బ్యానర్‌లో సినిమాలు నిర్మించేవారు. కానీ ఏదీ క‌లిసిరాలేద‌ని చెబుతున్నారు. జేఎస్కే కంబైన్స్‌ బ్యానర్‌పై 'కాంచనసీత', 'కలికాలం', 'హ్యాండ్సప్‌', 'మేరాపతి సిర్ఫ్‌ మేరా' చిత్రాలను నిర్మించారు. 'ఆశాజ్యోతి' చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నితిన్‌ కపూర్‌ మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: