వన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రంపై మొదటి నుండి భారీ అంచనాలే ఉండడంతో, కేవం పవన్‌ ప్యాన్స్‌ మాత్రమే కాకుండా ప్రేక్షకులు సైతం ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్రం రేట్లు పెంచేసారు. రూ.వంద కోట్ల కలెక్షన్‌ క్లబ్‌లో చేరాలన్న దురాశతోనే కాటమరాయుడు సినిమా టికెట్ల ధరలను నాలుగైదు రెట్లు పెంచారని అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అధ్యక్షులు జి.ఎల్‌. నర్సింహారావు, సీపీఐ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ సుధాకర్‌, సినీ అభిమాన సంఘాల ఐకాస అధ్యక్షులు పూర్ణచందర్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తొలి రెండు వారాల పాటు కాటమరాయుడు సినిమాను ప్రేక్షకులు స్వచ్ఛందంగా బహిష్కరించాలని వారు పిలుపునిచ్చారు.

మంగళవారం హైదర్‌గూడలోని న్యూస్‌సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో విడుదల కానున్న కాటమరాయుడు సినిమాకు రెండు వారాల పాటు థియేటర్లలో టిక్కెట్‌ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి కోరుతూ కొందరు థియేటర్‌ యాజమాన్యాలు హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేసి టికెట్‌ రేట్లు పెంచుకునేలా అనుమతి పొందారని ఆరోపించారు. థియేటర్లలో తొలి రెండు వారాల పాటు రూ.10 నేల టికెట్‌ ధరను రూ.50కి, రూ.50 బాల్కనీ టికెట్‌ ధరను రూ.200లకు అమాంతం పెంచేశారని ఆరోపించారు.

‘కాటమరాయుడు’ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 23వ తేదీన ప్రీమియర్‌ షోలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: