యువ కథానాయకుడు నాగచైతన్య హీరోగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఉగాది శుభాకాంక్షలు చెబుతూ బుధవారం విడుదల చేశారు. నాగార్జున ట్విట్టర్ ద్వారా రెండు పోస్టర్లను అభిమానులతో పంచుకుంటూ.. మొదటిది తన ఎంపికని, రెండోది దర్శకుడు ఎంపిక చేశారని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రానికి ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సమర్పిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: